ఉద్యోగుల పెన్షన్‌పై రాజకీయ పార్టీల వైఖరి చెప్పాలి

సమావేశంలో మాట్లాడుతున్న కె.శ్రీనివాసరావు

పల్నాడు జిల్లా: సెప్టెంబర్‌ 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేసే విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా తెలియ జేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీని వాసరావు డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నరస రావుపేట యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా ఆఫీస్‌ బేరర్లు రాష్ట్ర కౌన్సిలర్ల సమావేశం జరిగింది. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. విజయ సారథి కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పి.ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 28న పాత పెన్షన్‌ సాధన సభ రాజమండ్రిలో జరగనున్న నేపథ్యంలో ఈ సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకత్వాన్ని ఆహ్వానించామని, పాత పెన్షన్‌ అమలకు తమ వైఖరిని ఆయా పార్టీలు స్పష్టం చేయా లని కోరారు. ఎవరైతే ఈ రాష్ట్రంలో సిపిఎస్‌ రద్దుచేసి లక్షలాది ఉద్యోగుల ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ అమలు చేస్తారో వారికే ఉద్యోగుల మద్దతు ఇవ్వడం జరుగు తుందన్నారు. ఈ నెల 24న జిల్లా కేంద్రం నరసరావు పేటలో బకాయి సాధన కోసం ఉపాధ్యాయులతో బహిరంగ ప్రదర్శన ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బుల కోసం కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి రావడంపై విచారం వ్యక్తం చేశారు. బకాయిలు సాధన నిమిత్తం యుటిఎఫ్‌ చేస్తున్న దశల వారి పోరాటాలలో పాల్గొంటున్న వారిని అక్రమంగా అరెస్టులు చేయడం శోచనీయమన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ప్రేమ్‌కుమార్‌ మాట్లా డుతూ ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని మండి పడ్డారు. రాజ్యాంగ హక్కులను అమలు చేయడం ప్రభుత్వ కనీస కర్తవ్యమన్నారు. న్యాయమైన కోరికల సాధన కోసం నిర సనలు ఉద్యమాలు చేసే హక్కు ఉద్యోగులకు ఉందన్నారు. పాత పెన్షన్‌ అమలు చేయాలని పెండింగ్‌ ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 31 నుండి వచ్చే నెల 3 వరకు నరసరావుపేటలో రీలే నిరాహార దీక్షలు చేపట నున్నట్టు చెప్పారు. సమావేశంలో కోశాధికారి జె.వాల్యా నాయక్‌ ఆర్థిక నివేదికను జిల్లా గౌరవ అధ్యక్షులు కె. శ్రీనివాస రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జిల్లా సహాధ్యక్షుడు ఎం.మోహన్‌రావు, ఎ.భాగ్యశ్రీదేవి, జిల్లా కార్యదర్శిలు ఎ.తిరు పతి స్వామి, ఎం.రవిబాబు, చిన్నం శ్రీనివాసరావు, అజరు కుమార్‌, నాసర్‌ రెడ్డి, ఉషా సౌరిరాణి, ఏ శ్రీనివాసరావు, కె ప్రకాశరావు, షేక్‌ జిలాని, కిషోర్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎన్‌. సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️