ఉపాధి శిక్షణ ప్రారంభం

Feb 15,2024 21:23

 ప్రజాశక్తి-శృంగవరపుకోట  : గొంప క్రిష్ణ విద్యా సంకల్పం కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్‌, టైలరింగ్‌ కోర్సులను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ గురువారం ప్రారంభించారు, ఈ కోర్సుల శిక్షణ కోసం మొత్తం 388 రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అందులో టైలరింగ్‌కు 110 మందిని, బ్యూటీషియన్‌ కోర్సుకు 25 మందిని ఎంపిక చేశారు. వీరికి 3 నెలల పాటు న్యూ లైఫ్‌ అనే సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు క్రిష్ణ తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు లగుడు రవికుమార్‌, రాయవరపు చంద్రశేఖర్‌, రెడ్డి పైడిబాబు, గుమ్మడి భారతి, జుత్తాడ రామసత్యం, మాదిబోయిన మంగరాజు, ఆడారి ఉమా మహేశ్వరరావు, గనివాడ సన్యాసినాయుడు, కోరుకొండ శ్రీనివాసరావు, మండా త్రినాథ్‌, ముక్క రామకృష్ణ, కిలపర్తి హరి పాల్గొన్నారు.

➡️