‘ఉపాధి’ సిబ్బందికి శిక్షణ

Jan 6,2024 21:42
ఫొటో : మాట్లాడుతున్న ఎపిఒ సునీల్‌కుమార్‌

ఫొటో : మాట్లాడుతున్న ఎపిఒ సునీల్‌కుమార్‌
‘ఉపాధి’ సిబ్బందికి శిక్షణ
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధి హామీ సిబ్బందికి రెండు రోజులు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని ఎపిఒ సునీల్‌కుమార్‌ తెలిపారు. ఈ శిక్షణలో పాత పనులు, జరుగుతున్న పనులకు సంబంధించి, కొత్త పనులను గుర్తించి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ కల్పించి మేట్‌లు తమకు కేటాయించిన విధులను పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. ఫీల్డ్‌లో పనిచేసే పద్ధతిని గవర్నమెంట్‌ నిర్ణయించడంతో పనిచేసే సమయానికి ఉపాధి చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.272 తమ ఖాతాలో జమవుతాయని తెలిపారు. గ్రామాలలో రైతుల పొలాల్లో ఉపాధి హామీకి సంబంధించి ఫీల్డ్‌ వర్క్‌లో తము చేయాల్సిన కొత్త పనుల గురించి చిత్రీకరణ రూపంలో వారికి ఫారంపండు పనుల వివరాలను ఎపిఒ, ఎంపిడిఒ తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ నాగమణి, ఉపాధి హామీ సిబ్బంది, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️