ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం

ప్రజాశక్తి – భీమడోలు

మారుమూల ప్రాంతాల్లోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని సూరప్పగూడెం సాల్వేషన్‌ ఆర్మీ ప్రార్థనాలయానికి చెందిన పాస్టర్‌ భూపతి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రార్థన ఆలయం సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహించే ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేసే ఉచ్చుల సుజాతచే బత్తిన ఏసుదాసు సర్దుబాటులో భాగంగా మండల పరిషత్‌ యాజమాన్య పాఠశాలలకు బదిలీ అయ్యారు. ఇదేవిధంగా పూళ్ల ఎయిడెడ్‌ పాఠశాలలో పనిచేసే ఇదే గ్రామానికి చెందిన మండే సుధాకర్‌ కూడా మండల పరిషత్‌ యాజమాన్య పాఠశాలకు బదిలీ అయ్యారు. ప్రార్థన ఆలయం ఆధ్వర్యంలో స్థానికంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వీరిని సన్మానించారు. పలువురు ప్రముఖులు బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు వి.వెంకట్రావు, వి.మధు, బి.ఆదాం పాల్గొన్నారు.

➡️