ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు

Dec 17,2023 00:14
రాష్ట్రంలో యుటిఎఫ్‌

ప్రజాశక్తి – కాకినాడ

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరనిలోటని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు దడాల సుబ్బారావు అన్నారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్‌లో సాబ్జీ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజిలి ఘటించారు. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు మాట్లాడుతూ సాబ్జీ మరణం ఉపా ధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని అన్నారు. శాసనమండలిలో ఉపాధ్యాయ, ఉద్యోగుల, ఇతర కార్మిక వర్గాల వాణిని వినిపిం చారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో యుటిఎఫ్‌ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. అంకిత భావంతో పని చేసేవారని కొనియాడారు. సిపిఎం జిల్లా నాయకులు కెఎస్‌.శ్రీనివాస్‌, ఆర్‌పిఐ రాష్ట్ర నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు, సిఐటియు కాకినాడ రూరల్‌ కార్యదర్శి టి.రాజా, ఎస్‌ఎఫ్‌ఐ. జిల్లా కార్యదర్శి ఎంజి.సూరిబాబులు ఎంఎల్‌సి సాబ్జీతో ఉన్న అనుబంధాన్ని పంచు కున్నారు. ఈ కార్యక్రమంలో పి.రామకృష్ణ, జుత్తుక శ్రీనివాస్‌, సిహెచ్‌.విజరు కుమార్‌, పి.నాగదేవి, సిహెచ్‌.పద్మ, కె.సింహాచలం, సిహెచ్‌. అజరు కుమార్‌, చైతన్య రెడ్డి, వరహాలు, వి.చంద్రరావు పాల్గొన్నారు.

➡️