ఉప్పంగి హరిజనవాడలో పర్యటించిన సిపిఎం

Dec 5,2023 21:12
తుపానులో చిక్కుకున్న బాధితులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు టి.సుబ్రమణ్యం, వేణు

ఉప్పంగి హరిజనవాడలో పర్యటించిన సిపిఎంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు తిరుపతిలో నీట మునిగాయి. ఉప్పంగి హరిజనవాడ, గొల్లవానిగుంట, ఆటోనగర్‌, కరకంబాడి రోడ్డు, వెంకట్‌రెడ్డి కాలనీల్లో సిపిఎం బృందం పర్యటించింది. సమస్యలను గుర్తించి మున్సిపల్‌ కమిషనర్‌, తహశీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. 70 ఇళ్లల్లోకి వర్షపునీరు చేరడంతో రాత్రులు నిద్రలేకుండా గడిపారు. డ్రైనేజినీరు తాగేనీళ్లలో కలుషితమై తాగడానికీ నీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సిపిఎం నగర కార్యదర్శి టి.సుబ్రమణ్యం, నాయకులు కె.వేణు, పి.బుజ్జి ఉన్నారు. తుపానులో చిక్కుకున్న బాధితులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు టి.సుబ్రమణ్యం, వేణు

➡️