ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీకి ఘన నివాళి

ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీకి ఘన నివాళి

ప్రజాశక్తి-యంత్రాంగం ఎంఎల్‌సి షేక్‌ సాబ్జికు పలువురు శనివారం ఘనంగా నివాళి అర్పించారు. అంగన్‌వాడీలు సమ్మె శిబిరాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు నివాళులర్పించారు. రాజమహేంద్రవరం ఎస్‌కెవిటి ఉన్నత పాఠశాలలో షేక్‌ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి యుటిఎఫ్‌ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంతాప సభలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్‌ మాట్లాడారు. షేక్‌ సాబ్జీ మంచి ఉపాధ్యాయుడు, గొప్ప ఉద్యమకారుడు, సంఘ నాయకుడు, ప్రజల పక్షాన శాసనమండలిలో గళం వినిపించిన నేత అన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.అరుణకుమారి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారన్నారు. సిఐటియు నాయకులు టి.అరుణ్‌ మాట్లాడుతూ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ వంటి గొప్ప నాయకుని మృతి అన్ని రంగాల ప్రజలకు తీరని లోటు అన్నారు. విద్యాసంస్థల పరిరక్షణ కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బాలోత్సవం నిర్వాహకులు తులసి మాట్లాడుతూ ఆయనకు పిల్లల పండుగ బాలోత్సవం అంటే ఎనలేని ప్రీతి అని, బాలోత్సవం నిర్వహణకు ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ఎ.షరీఫ్‌, ఎం.విజయ గౌరి, ఐ.రాంబాబు, రూపస్‌ రావు, శ్రీమణి, ఎన్‌.రవిబాబు, ఎం.రమేష్‌ బాబు, జిఎం శ్రీనివాసరావు, ప్రకాశరావు సిఐటియు సీనియర్‌ నాయకులు టి.ప్రకాష్‌, ఎస్‌ఎస్‌.మూర్తి, రాజులోవ, రాంబాబు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్షి సంఘ నాయకులు, బాలోత్సవం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాగల్లు ఎంఆర్‌సి కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారులు, హెచ్‌ఎంలు, యుటిఎఫ్‌ నాయకులు సాబ్జీకి ఘనంగా నివాళులర్పించారు. ఎంఇఒలు వి.ఖాదర్‌బాబు, సిహెచ్‌.శుభాకర్‌, హెచ్‌ఎంలు రమణ, నాగేశ్వరావు, షేక్‌ అబ్దుల్‌ కరీం, సూరిబాబు, కోటేశ్వరావు , యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాసముర్తి, అధ్యక్షులు జె.రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి రవి వర్మ పాల్గొన్నారు తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌ సమ్మె శిబిరం వద్ద పి.విజయకుమారి, బి.మహాలక్ష్మి, కె.లక్ష్మి, ఎ.శ్రీదేవి, ఎస్‌.అరుణ్‌ కుమారి, కె.దమయంతి, సిఐటియు నాయకులు షేక్‌ ఆదాం, యుటిఎఫ్‌ నాయకులు పిల్లి శ్రీనివాసమూర్తి, పిట్టా రవి వర్మ నివాళులర్పించారు. కొవ్వూరు రూరల్‌ సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర బాబు అంగన్వాడిల సమ్మె శిబిరం వద్ద నివాళులర్పించారు. తాళ్లపూడి అంగన్వాడీలు సాబ్జీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలన వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు బట్టు దుర్గ, సెక్టార్‌ లీడర్స్‌ భాస్కరం, సుజాత, ఉమా, దయామణి పాల్గొన్నారు.

➡️