ఎఎంసి చైర్మన్‌ బాధ్యతల స్వీకరణ

ప్రజాశక్తి-కనిగిరి : కనిగిరి ఎఎంసి చైర్మన్‌గా ప్రముఖ న్యాయవాది చింతగుంట్ల సాల్మన్‌ రాజు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సాల్మన్‌రాజును ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌, ఎంపిపి దంతులూరి ప్రకాశం, వైసిపి నాయకులు తదితరులు సత్కరించి అభినందనలు తెలిపారు.

➡️