ఎడ్ల పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి-దర్శి: జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన అట్టహాసంగా శనివారం జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్‌ ప్రారంభించారు. స్థానిక అద్దంకి రోడ్డులో జాతీయ స్థాయి ఒంగోలు స్థాయి ఎడ్ల బలప్రదర్శన నాలుగు రోజులు పాటు జరుగుతుంది. పది క్వింటాళ్ల బండ లాగుడు పోటీల్లో నాలుగు పళ్ల ఎద్దులు 38 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పోటీలు రాత్రి ఒంటి గంట వరకు జరుగుతాయని నిర్వాహకులు గరికపాటి పవన్‌, గోపి తెలిపారు. తిలకించేందుకు ప్రజలు ఎద్దుఎత్తున వచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి బొటుకు రమేష్‌, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ, దిరిశాల ఏసురెడ్డి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7వ తేదీన 12 క్వింటాళ్లు, 8వ తేదీన 16 క్వింటాళ్లు, 9వ తేదీన 22 క్వింటాళ్ల బరువు గల బలప్రదర్శన జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

➡️