ఎన్‌టిఆర్‌కు ఘన నివాళి

ప్రజాశక్తి -యర్రగొండపాలెం : దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. టిడిపి కార్యాలయంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని వినుకొండ రోడ్డు, పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, నాయకులు మస్తాన్‌వలి, వలి, కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, కోటయ్య, గొట్టం శ్రీనివాసరెడ్డి, కామేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. త్రిపురాంతకం : మండల పరిధిలోని మిట్టపాలెం గ్రామంలో మాజీ సర్పంచి ఓట్ల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు అనుమాలశెట్టి సుబ్బారావు, మాజీ సర్పంచి బాదుల్లా, శాఖమూరి వెంకట్‌ నారాయణ, ఓట్ల ఆదినారాయణ, మురిమిశెట్టి సత్యనారాయణ, మాకం వెంకటయ్య పాల్గొన్నార రాచర్ల : మండల పరిధిలోని అనుములపల్లి జంక్షన్‌లో టిడిపి మండల అధ్యక్షుడు కటిక యోగానంద్‌ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చీమకుర్తి : దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ వర్ధంతి సందర్భంగా టిడిపి కార్యాలయం వద్ద అన్నదానం నిర్వహించారు. అన్నదానాన్ని మాజీ ఎమ్మెల్యే బిఎన్‌.విజయకుమార్‌ ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఎన్‌టిఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు మన్నం ప్రసాదు, కాట్రగడ్డ రమణయ్య, గొల్లపూడి సుబ్బారావు, యడ్లపల్లి రామబ్రహ్మం, ఉన్నం సుబ్బారావు,జి. రాఘవరావు, వేల్పుల శ్రీను,శేషయ్య, ఆర్‌.రాంబాబు,గొల్లపూడి కోటేశ్వరరావు పాల్గొన్నారు. పెద్దారవీడు : మండల పరిధిలోని దేవరాజుగట్టు గ్రామంలోని టిడిపి కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మ గంగరాజు, మండల మాజీ అధ్యక్షులు గొట్టం శ్రీనివాస్‌రెడ్డి, ఐటిడిపి జిల్లా అధ్యక్షులు నక్కా శ్రీను, ఎంపిటిసి దండ వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పాముల పోలురాజు, సీనియర్‌ నాయకుడు గొట్టం రామనారాయణరెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్షులు అన్నెం చిన్నసత్యనారాయణరెడ్డి, మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు కన్నేబోయిన సుబ్బయ్య పాల్గొన్నారు. కొండపి : మండల కేంద్రమైన కొండపిలోఎన్‌టిఆర్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కట్టావారిపాలెం, పేరిదేపి గ్రామాల్లో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచర్ల సత్య, రావిపాటి బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గుండపనేని అచ్యుత్‌కుమార్‌ , గుండపనేని రామూర్తి నాయుడు, రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాయపాటి సీతమ్మ, టిడిపి మండల అధ్యక్షుడు బొడ్డపాటి యలమందనాయుడు, నరసారెడ్డి, ఎఎంసి మాజీ డైరెక్టర్లు తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, బీసీ సెల్‌ నాయకులు బత్తుల నారాయణస్వామి,నరసారెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు షేక్‌ కాలేషా, తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు బొద్దులూరి ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని పెట్లూరు గ్రామంలో ఎన్‌టిఆర్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసుర్నతం ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆరితోటి బాబూరావు, ఎఎంసి మాజీ డైరెక్టర్‌ కందిమళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు బొల్లినేని నరసింహం, మూలె రామారావు, వేముల మల్లికార్జునరావు, కోయవారిపాలెం రవి, శ్రీనివాసులరెడ్డి, మోహనరావు, పాల్గొన్నారు. మద్దిపాడు : దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌. విజరు కుమార్‌ , టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నుకసాని బాలాజీ, గోరంట్ల రవికుమార్‌ పాల్గొన్నారు. అనంతరం మద్దిపాడు వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మండవ జయంత్‌ బాబు, గ్రామ అధ్యక్షుడు కడియాల రఘు బాబు, ఎఎంసి మాజీ చైర్మన్‌ మండవ రంగారావు, మాజీ సర్పంచి ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆడక స్వాములు, అబ్బూరి శేషగిరి, సీతారామపురం సర్పంచి మండవ శివనంద రావు, వెల్లంపల్లి ఎంపిటిసి అద్దేపల్లి భవాని, కాకర్ల లక్ష్మి ప్రసాద్‌ ,బాపట్ల పార్లమెంట్‌ కమిటీ సభ్యులు దుద్దుకూరి డేవిడ్‌ పాల్గొన్నారు. నాగులుప్పలపాడు : దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని ఉప్పుగుండూరులో ఒంగోలు సిమ్స్‌ చర్మవ్యాధుల వైద్యశాల వారి సహకారంతో ఉచిత వైద్యశిబిరం నిర ్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు సిమ్స్‌ వైద్యశాల వైద్యుడు డాక్టర్‌ చెంచయ్య ఆధ్వర్యంలో 150 మందికి వైద్యపరీక్షలు నిర్వహించిన ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 21 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షుడు కాట్రగడ్డ చంద్రబాబు , ఐటిడిపి మండల కన్వీనరు బెల్లం వెంకటేశ్వర్లు, టిడిదపి సంతనూతలపాడు నియోజవర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌.విజయకుమార్‌, మాజీ ఎంపిపి వీరయ్య చౌదరి, టిడిపి మండల అధ్యక్షుడు మనోజ్‌ , కాకర్ల లక్ష్మి వరప్రసాదు, కనగాల శ్రీను, సెల్వం, బెల్లం మురళీ, తిరుమలశెట్టి శ్రీను, బెల్లం శ్రీను, గోగినేని ఆంజనేయులు , ఎస్‌. ఆంజనేయులు పాల్గొన్నారు. మార్కాపురం : మార్కాపురం పట్టణం, మండల పరిధిలోని రాయవరం గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు వక్కలగడ్డ మల్లికార్జునరావు, కందుల రామిరెడ్డి మాట్లాడారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, టిడిపి మండల ఉపాధ్యక్షుడు దేవండ్ల వెంకటేశ్వర్లు, ఎఎంసి మాజీ చైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్‌ : బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి నాంది పలికింది అన్న నందమూరి తారకరామారావు అని టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ముండ్లపాడు గ్రామంలో ఎన్‌టిఆర్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, ముండ్లపాడు సర్పంచి కడియం శేషగిరిరావు, శీలం కష్ణ, పద్మావతి, యశోదమ్మ, మాజీ ఎంపిటిసి రాసా మస్తాన్‌, మాజీ సర్పంచి ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️