ఎన్నికలకు యంత్రాంగం సంసిద్ధం

Feb 24,2024 22:06

ఎన్నికలకు యంత్రాంగం సంసిద్ధం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు, రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్‌ సిబ్బందిని సమాయత్వం చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు, చిత్తూరు నియోజవర్గ పార్లమెంట్‌ అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చే నెల రెండో వారంలో విడుదలకానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం జిల్లాలో 15,54,712 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,65,903, మహిళా ఓటర్లు 7,88,725 మంది ఉన్నారు. ప్రతి నియోజక వర్గంలోనూ పురుష ఓటర్ల కన్నా మహిలా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీలను ఎన్నికల విధుల్లోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల విధులకు హాజరుకావల్సి ఉంటుందని ఉపాధ్యాయులు జిల్లా ఎన్నికల అధికారి నుండీ ఆదేశాలు పంపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనలేకపోతున్న ఉపాధ్యాయు సహాతుకమైన కారణాలు చూపాల్సి వుంటుంది. ఆనారోగ్య సమస్యలున్న వారికి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేతలు జిల్లా రెవెన్యూ అధికారిని కలిశారు. గర్భిణీలు, బాలింతలు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అంగన్వాడీలను కూడా ఎన్నికల విధుల్లో వినియోగించుకోనున్నారు. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండీ అంగన్వాడీల జాబితాను జిల్లా ఎన్నికల అధికారులు సేకరించారు. జిల్లా కేంద్రంలోని గోడౌన్‌లోని ఈవిఎంలను తనిఖీ చేసి పనితీరును పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రంలో ఈవిఎం మోరాయిస్తే వెంటనే మరమ్మతులు చేసేందుకు సాంతికేతి నిపుణులను ఏర్పాటు చేయడతో మరో ఈవిఎంను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో జరగబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల వేళ సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పోలీస్‌శాఖ చెపడుతోంది. అక్రమమద్యం రవాణాను అరికట్టి అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నిఘా పెంచనున్నారు. వాహనాల తనిఖీలు, ఎక్సైజ్‌ డిపార్టుమెంటుతో కలసి అక్రమ మద్యం కట్టడికి దాడులు నిర్వహించేందుకు పోలీస్‌శాఖ ప్రాణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు స్టేషన్‌ల పరిధిలో అంతరాష్ట్ర సరిహద్దులు, జిల్లాల వివిధ ప్రాంతాల్లో ఉన్న చెక్‌ పోస్టులను నిరంతరం పర్యవేక్షించనున్నారు. జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. అక్రమ మద్యం, నాటు సారాపై ఉక్కుపాదం మోపి కేసుల్లో అరెస్టు కాని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. రౌడీ షీటర్లను బౌండోవర్‌ చేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీస్‌శాఖ ఎన్నికల ముందు నుంచే నిఘా పెంచింది.

➡️