టిడిపిలో చేరిన మున్సిపల్ చైర్మెన్, పాలకవర్గం

Jun 27,2024 13:03 #Chittoor District

ప్రజాశక్తి-పుంగనూరు : పుంగనూరు మున్సిపాలిటీలో వైసిపికి చెందిన చైర్మన్ వాళ్లకి కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మున్సిపల్ చైర్మన్ అలీంబాషా,17 మంది కౌన్సిలర్లు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్ల బాబు ఇంటీ కి వెళ్లి గురువారం పార్టీ లోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన చైర్మన్ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు మున్సిపల్ కేంద్రంలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ పార్టీయే ఉన్నదని. మాకు అందరికీ పదవులు అయితే ఇచ్చారు కానీ పవర్ లేకుండా చేశారని చెప్పారు. యువత అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నాయని చంద్రబాబు పరిపాలన అభివృద్ధికి బాట వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ లో చేరుతున్నామని ప్రకటించారు.వైసిపి పాలకవర్గం తెలుగుదేశం పార్టీలో చేరడంతో పట్టణంలో పెద్ద చర్చ వాతావరణం ఏర్పడింది. ఇది కళా నిజమని నమ్మలేకపోతున్నామని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ చైర్మన్ పాలకవర్గం కలిసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించడం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారిలో ఉన్న అసంతృప్తిని తెలపడం జరిగింది. అయితేమిగిలిన తెలుగుదేశం పార్టీ వర్గం మాత్రంవీరిని టిడిపిలో చేర్చుకోవడంతో అ సంతృప్తి సెగలు వెలగక్కుతున్నారు.

➡️