ఎన్నికల కోడ్‌ అమలులో నిర్లక్ష్యం

ఎన్నికల కోడ్‌

నేతల ఫొటోలతో శిలాఫలకం …అయినా పట్టించుకోని అధికారులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఎన్నికల కోడ్‌ అమలులో అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్‌ ప్రకటించి, మూడు రోజులు గడిచినా ఇంకా రాజకీయపార్టీల నేతల బొమ్మలతో బోర్డులు, శిలాఫలకాలు యథావిధిగా దర్శనమిస్తూనే ఉన్నాయి. మండలంలోని రేఖవానిపాలెంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వేసిన శిలాఫలకంపై ముఖ్యమంత్రి జగన్‌, స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత వైసిపి పోటీ అభ్యర్థి ముత్తంశెట్టి ఫొటోలు కనిపిస్తూనే ఉన్నాయి.భీమిలి, తగరపువలస ప్రధాన రహదారిలో అందరికీ కనిపించేలా ఉన్న శిలాఫలకంపై ఫొటోలు ఉన్నా వాటిని కప్పేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాల్సి ఉంది.

భీమిలి తగరపువలస రోడ్డుపై శిలాఫలకంపై యథావిధిగా ఫొటోలు

➡️