ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

Mar 23,2024 20:38

ప్రజాశక్తి- మెంటాడ : ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారులు పక్కాగా అమలు చేయాలని ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటామని సాలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, పార్వతీపురం ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌ సూచించారు. మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, వాలంటీర్లపై నిఘా ఉందని, ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ యస్‌.దిలీప్‌ చక్రవర్తి, ఎంపిడిఒ లక్ష్మీబాయి, ఇఒపిఆర్‌డి విమల కుమారి, ఎంఇఒలు తదితరులు పాల్గొన్నారు.ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలిగంట్యాడ: ఓటు వేసే రోజున ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సి బాధ్యత అందరిపై ఉందని గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, ఆర్‌డిఒ సూర్య కళ అన్నారు. మండలంలోని శనివారం రూట్‌ నెంబర్‌ 28లోని కొత్త వెలగాడ, మదనాపురం, తాటిపూడి, మధుపాడ పోలింగ్‌ స్టేషను తనిఖీ చేశారు. ఇప్పటి నుండి ప్రతి పోలింగ్‌ స్టేషను పరిశీలన చేయాలని సూచించారు. ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ నేలకంఠేశ్వర రెడ్డి, ఎంఇఒ వెంకటరావు, సెక్టర్‌ 22 అధికారి సిడిపిఒ ఉమా భారతి, ఆర్‌ఐ హరిప్రియ, బూత్‌ లెవెల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.బొబ్బిలి: ఎన్నికల నియమావళిపై అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్‌డిఒ ఎ. సాయిశ్రీ ఆదేశించారు. తన కార్యాలయంలో ఎన్నికలు నిర్వహణపై శనివారం నియోజకవర్గంలో ఉన్న మున్సిపల్‌, నాలుగు మండలాల అధికారులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళిను ఉల్లంఘించిన ఏ పార్టీ నాయకులైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారం, సభలు, ర్యాలీలను పర్యవేక్షణ చేయాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎన్నికలు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డిఎస్‌పి శ్రీనివాసరావు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.బిఎల్‌ఒలతో సమావేశంవేపాడ: స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో మండలంలోని బిఎల్‌ఒలకు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ రెవెన్యూ అధికారులకు ఎన్నికల కోడ్‌పై శనివారం అధికారులు వివరించారు. సచివాలయాల పరిధిలో నిర్వహించే ర్యాలీలకు, సమావేశాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామాలలో ఓటర్లను ప్రలోభాలు పెట్టే వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఎన్నికలు పూర్తయినంత వరకూ గ్రామ సచివాలయ సిబ్బందికి, గ్రామ రెవెన్యూ అధికారులకు సెలవులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ, తహశీల్దార్‌, ఆర్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

➡️