వైసిపిపై దాడుల వివరాలివ్వండి : హైకోర్టు

Jun 20,2024 22:48 #AP High Court, #YCP

ప్రజాశక్తి – అమరావతి : చట్టసభలకు జరిగిన ఎన్నికల సమయంలో వైసిపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయనే కేసులో పూర్తి వివరాలను నివేదించాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిలకు నోటీసులిచ్చింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలిచ్చింది. దాడులను పోలీసులు చూస్తూ ఉన్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రాజ్యసభ సభ్యుడు, వైసిపి సీనియర్‌ నేత వైవి సుబ్బారెడ్డి వేసిన పిల్‌ తరపున న్యాయవాది కొవ్వూరి వెంకట్రామిరెడ్డి వాదించారు.

➡️