ఎన్నికల కోడ్‌ పటిష్ట అమలుకు చర్యలు

ఎన్నికల కోడ్‌

అధికారులకు జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి దిశానిర్ధేశం

ప్రజాశక్తి -అనకాపల్లి : ఎన్నికల కోడ్‌ పటిష్ట అమలుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల నియమావళిలో సూచించిన ముందస్తు పనులు చేపట్టాలన్నారు. ఎన్నికల అనుబంధ కమిటీలు నిర్దేశిత విధులను తుచ తప్పకుండా పాటించాలన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, ఆస్తుల లోపల బయట ఎటువంటి హోర్డింగులు, రాజకీయ నాయకుల బొమ్మలుకనిపించరాదన్నారు. విగ్రహాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుపరాదన్నారు. అంతకు ముందు విజయవాడ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్‌ ఎం.కె.మీనా వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించిన ఆదేశాలను వివిధ ఎన్నికల విభాగాల నోడల్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.కమాండ్‌ కంట్రోల్‌ రూం పరిశీలనకలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి పరిశీలించారు. నోడల్‌ అధికారుల ఆదేశాలతో ఎంసిసి, ఎంసిఎంసి, వీడియో వీవింగ్‌, వీడియో సర్వేలెన్స్‌, మొదలైన టీమ్‌లన్నీ నిబద్దతతో పనిచేయాలన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల ప్రక్రియను ఇక్కడి నుండే పర్యవేక్షించి, రిపోర్టులను ఎన్నికల కమిషన్‌కు నివేదించనున్న నేపథంయలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ల వివరాలు, పోలింగ్‌ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, రూట్‌ మ్యాపులు అందుబాటులో వుండాలన్నారు. కార్యక్రమాల్లో సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.స్మరణ్‌రాజ్‌, కంట్రోల్‌ కమాండ్‌ రూమ్‌ నోడల్‌ అధికారి ప్రసాదరావు, ఎన్నికల ఖర్చు విభాగం నోడల్‌ అధికారి జి.సత్యనారాయణ, ఎంసిఎంసి నోడల్‌ అధికారి జి.వి.లక్జ్మి, డిపిఆర్వో డి.సాయిబాబా, డిఆర్‌ఒ బి. దయానిధి, నర్సీపట్నం, అనకాపల్లి ఆర్‌డిఒలు హెచ్‌.వి.జయరామ్‌, ఎ.చిన్నికృష్ణ, జిఎస్‌ డబ్ల్యుఎస్‌ మంజులవాణి, డిఆర్‌డిఎ పిడి శచీదేవి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఏ.హేమంత్‌, ఆర్‌అండ్‌బి ఈఈ రమేష్‌, డిసిఓ కిరణ కుమారి, లీడ్‌ బ్యాంకు మేనేజరు సత్యనారాయణ, మత్స్యశాఖ డిడి ప్రసాద్‌, డిఎస్‌ఒ కెవిఎల్‌ మూర్తి పాల్గొన్నారు.

 మాట్లాడుతున్న కలెక్టర్‌.

➡️