ఎన్నికల ప్రచారంలో వరికూటి లక్ష్మి

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వేమూరు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు ఓ పక్క ఎన్నికల ప్రచారం చేస్తుండగా మరోపక్క ఆయన సతీమణి లక్ష్మి కూడా తనదైన శైలిలో నియోజకవర్గంలో మహిళామణులను కలుస్తూ పార్టీ ప్రచారాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా మంగళవారం భట్టిప్రోలులోని అద్దేపల్లి గ్రామంలో మొగల్‌ స్ట్రీట్‌లోని ముస్లిం మహిళలను కలిసి ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవస్థానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో అశోక్‌బాబును గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగటానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ దారా రవి కిరణ్మయి, ఎంపీపీ డివి లలిత కుమారి, జడ్పిటిసి టి. ఉదరు భాస్కరి, మాజీ జెడ్పిటిసి బండారు కుమారి, ఎంపీటీసీ కవుతరపు పద్మావతి, మండల ఉపాధ్యక్షులు కే పిచ్చయ్య శాస్త్రి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

➡️