ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని ధర్నా

ప్రజాశక్తి -సంతనూతలపాడు : ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్‌ మాబు డిమాండ్‌ చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఎస్‌బిఐ బ్రాంచి వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షేక్‌ మాబు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయ అవినీతి ముసుగులో కార్పొరేట్‌ కంపెనీ నుంచి డబ్బులు తీసుకోవటానికి నేరుగా కాకుండా ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకొనేందుకు ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. కార్పొరేట్‌ కంపెనీలు ఎస్‌బిఐ బ్యాంకుల వద్ద సుమారు 8,500 కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేస్తే అందులో రూ.6,500 కోట్లు పైగా బిజెపికి వచ్చాయన్నారు. దీని ద్వారా పెద్దఎత్తున దేశంలో అవినీతి క్విడ్‌ ప్రోకో రూపంలో జరిగే దానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ ఎన్నికల బాండ్లను రద్దు చేయాలని ప్రకటించిందన్నారు. మార్చి 6 లోపు ఎన్నికల బాండ్ల వివరాలు బయట పెట్టమని సుప్రీంకోర్టు కోరగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేము జూన్‌ 30 లోపు తెలియపరచలేమని చెప్పడం కేంద్రంలోని అధికారంలో ఉన్న బిజెపికి అనుకూలంగా వ్యవహరించడమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బంకా సుబ్బారావు నాయకులు అబ్బూరి వెంకటేశ్వర్లు, కరిచేటి హనుమంతరావు, ఎం సుబ్రహ్మణ్యం, కె రామకృష్ణారెడ్డి, ఈ సుబ్బారావు, టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.మార్కాపురం రూరల్‌ : ఎన్నికల బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు అందజేయాలని కోరుతూ తర్లుపాడు రోడ్డులోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నియోజకవర్గ నాయకులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ దేశంలో బిజెపి నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిని చట్టబద్ధం చేసేలాగా, కార్పొరేట్ల అవినీతి సొమ్ము రాజకీయ పార్టీలకు చేరేలాగా ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల బాండ్లు 2005 సమాచార హక్కు చట్టానికి విరుద్ధమన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డికెఎం.రఫీ, పందీటి రూబెన్‌, జవాజి రాజు, గుంటూరు కొండయ్య, కట్ట సుబ్బారావు, పిచ్చయ్య, బి. కాశయ్య, రాజబాబు, కొండేటి నగేష్‌, ఏనుగుల సురేష్‌కుమార్‌, చెన్నకేశవులు పాల్గొన్నారు. టంగుటూరు : ఎన్నికల బాండ్లు ద్వారా ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత డబ్బు ఇచ్చారో వెంటనే బహిర్గతం చేయాలని కోరుతూ సిపిఎం నాయకులు టంగుటూరులోని స్టేట్‌ బ్యాంక్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు పథకం ఏకపక్షంగా ఉందంటూ సుప్రీంకోర్టు ఆ పథకాన్ని రద్దు చేసినటుల తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కి ఎస్‌బిఐ ఎన్నికల బాండ్లను గోప్యంగా ఉంచడం ఆక్షేపణీయమన్నారు. బిజెపి అందుకున్న రూ.6,565 కోట్ల విలువైన బాండ్లు ఎవరు ఇచ్చారు అనే వాస్తవాలు బయటపడతాయన్న భయంతోనే బిజెపి ఎస్‌బిఐని అడ్డుపెట్టుకొని వాయిదాలు కోరడం సుప్రీంకోర్టును కించపరచడమే అవుతుందని వారు ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టంగుటూరి రాము, వేశపోగు మోజెస్‌, పడిదపు రవికుమార్‌, నారాయణరావు, మల్లాల యానాది, కొల్లాబత్తిన శ్రీనివాస్‌, టంగుటూరి పాపారావు, పి.బాబూరావు, జి.అంకయ్య, సిహెచ్‌.మాధవ, యేసు తదితరులు పాల్గొన్నారు. దర్శి : ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌బిఐ వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఎస్‌బిఐ మేనేజర్‌కు వినతి పత్రం అందించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, జాన్‌ గురవయ్య పాల్గొన్నారు. చీమకుర్తి : ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే ప్రకటించాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్‌ చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించాలని కోరుతూ స్టేట్‌ బ్యాంకు ఎదుట సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. గత నాలుగేళ్లలో అమ్మిన,కొన్నవారి వివరాలను ఎన్నికల సంఘానికి ఎస్‌బిఐ అందజేయాలన్నారు. ఈనెల6 లోపు అన్ని వివరాలు ఎన్నికల సంఘానికి ఎస్‌బిఐ సమర్పించాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఎస్‌బిఐ విఫలమమైందన్నారు. ఎస్‌బిఐ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కె. చిన్నపురెడ్డి, పల్లాపల్లి ఆంజనేయులు, నల్లూరి కృష్ణయ్య, కుమ్మిత శ్రీనివాసులరెడ్డి,టి. రామారావు, పులిఓబులరెడ్డి, ఆదినారాయణ,కొల్లూరి అక్కయ్య,జి. శంకర్‌, ఆంజనేయులు, బెజవాడశ్రీను పాల్గొన్నారు.మద్దిపాడు: ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణమే వెల్లడించాలని కోరుతూ స్థానిక ఎస్‌బిఐ వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఉబ్బా ఆదిలక్ష్మి, నాయకులు కనపర్తి సుబ్బారావు, ఉబ్బా వెంకటేశ్వర్లు, కె.సుబ్బారావు, ఖాసిం, . అక్బర్‌ పాల్గొన్నారు. పామూరు : ఎన్నికల బాండ్లను వివరాలను వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని స్థానిక ఎస్‌బిఐ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యాద్రి మాట్లాడుతూ 2019లో బిజెపి ప్రభుత్వం ఎన్నికల బాండ్‌ పేరుతో రాజకీయ పార్టీలు కార్పొరేట్‌ సంస్ధలు, పారిశ్రామికవేత్తల నుంచి నగదు సేకరించిందన్నారు. బిజెపి 6,565 వేల కోట్లు ఎన్నికల ఫండు సేకరించి దాంతో దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చివేతకు పాల్పడుతూ విధ్వంసకర విధానాలు అవలంబిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల బాండ్లు నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నికల బాండ్లు వివరాలు బయటపడితే బిజెపి భాగోతం బయటపడుతుందని, అందుకే కాలయాపన చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ గౌస్‌ బాషా, సిహెచ్‌. వెంకటేశ్వర్లు, ఎస్‌కె.అల్లాభక్షు, మహాదేవయ్య, కరిముల్లా, మాధవకృష్ణ, పుల్లయ్య, పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️