ఎన్నికల సమాచారాన్ని సిద్ధం చేయాలి

Dec 20,2023 23:44
రాబోయే ఎన్నికలకు

ప్రజాశక్తి – కాకినాడ

రాబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర కేంద్రంలోని ఉన్నతాధికారులకు అవసర మైన సమాచారాన్ని సన్నద్ధం చేయాలని ఏలూ రు రేంజ్‌ డిఐజి జివిజి.అశోక్‌ కుమార్‌ ఆదేశిం చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా ఎస్‌పి కార్యాలయంలో ఆయన తనిఖీలు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయ పరిపాల నాధికారి శివరామరాజు, సంబంధిత విభాగాల మినిస్టీరియల్‌ సిబ్బంది వారి విభాగాల వారీగా సమర్పించిన వార్షిక ప్రగతి నివేదికలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల బందొబస్తు నిర్వహించే జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క సంక్షే మం, ఇతర విధి నిర్వహణ అవసరాల నిమిత్తం సకాలంలో స్పందించేలా సంసిద్ధంగా ఉండా లని ఆదేశించారు. ఇతర ఎన్నికల సంబంధిత ఉన్నతాధికారులకు అందించేలా సిద్ధం చేయాల న్నారు. పోలీసు స్టేషన్‌ స్థాయి నుంచి రావాల్సి న సమాచారాన్ని సేకరించేందుకు ఇప్పటి నుంచే సబ్బందికి అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం డిసిఆర్‌బి, డిటిఆర్‌బి, స్పెషల్‌ బ్రాంచ్‌ కీలక విభాగాల వార్షిక పనితీరు నివేది కలను ఆయన పరిశీలించారు. పోలీసు పరేడ్‌ మైదానంలో సాయుధ బలగాల కవాతును వీక్షిం చి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ తనిఖీ లో ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, ఎస్‌పి(అడ్మిన్‌) పి.శ్రీనివాస్‌, ఆర్మ్డ్‌ రిజర్వ్‌ అడిషనల్‌ ఎస్‌పి బి.సత్యనారాయణ, జిల్లా పోలీసు కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ శివరామరాజు, పలువురు డిఎస్‌పిలు, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️