ఎపి సీడ్స్‌ రైతులకు తీపికబురు

Feb 27,2024 21:11

 ప్రజాశక్తి – సాలూరు  : ఎపి సీడ్స్‌ రైతులకు తీపికబురు అందింది. విత్తన ధాన్యం విక్రయించిన రైతులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆందోళన చెందిన రైతులు కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సిఎం రాజన్నదొరను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. 3వేల మంది రైతులు సుమారు 30వేల క్వింటాళ్ల విత్తన ధాన్యం విక్రయించారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు చెందిన రైతులు ఎపి సీడ్స్‌కు ఏటా విత్తన ధాన్యం విక్రయిస్తుంటారు. ధాన్యం విక్రయించిన కొద్దిరోజుల్లోనే ఎపి సీడ్స్‌ సంస్థ రైతులకు అడ్వాన్స్‌ కింద కొంత మొత్తాన్ని పంపిణీ చేస్తుంది. కానీ ఈసారి అడ్వాన్స్‌ చెల్లింపులో తీవ్ర జాప్యం కావడంతో రైతులు ఆందోళన చెంది రాజన్నదొరను సంప్రదించారు. దీంతో ఆయన వెంటనే సిఎం జగన్‌ మోహన్‌రెడ్డికి రైతుల సమస్య గురించి లేఖ రాశారు. అమరావతిలో వున్న రాజన్నదొర సమస్య తీవ్రతను వివరిం చారు. సిఎం ఆదేశాలతో ఎపి సీడ్స్‌ సంస్థ రైతులకు అడ్వాన్స్‌ చెల్లింపులు జరపడానికి సిద్ధమైంది. వారం రోజుల్లో రైతులకు చెల్లించాల్సిన అడ్వాన్స్‌ మొత్తం రూ.5.33 కోట్లు చెల్లింపు చేస్తామని సంస్థ ఎమ్‌ డి చెప్పారని రాజన్నదొర ఫోన్‌లో చెప్పారు.

➡️