ఎమ్‌పిగా పోటీకి సిద్ధం

Jan 27,2024 20:37

ప్రజాశక్తి – పూసపాటిరేగ : ఉత్తరాంద్ర అభివృద్దే ద్యేయంగా సేవ చేసుకోవడానికి అవకాశమిస్తే విజయనగరం ఎంపిగా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని విద్యావేత్త గంటా అప్పలనాయుడు తెలిపారు. రానున్న ఎన్నికలు నేపథ్యం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ విద్యా, రాజకీయం, సంక్షేమపై అవగాహన ఉన్న తాను ఈ ప్రాంతం ఎంపిగా పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉందన్నారు. రాజకీయపార్టీ ప్లాట్‌పాం ద్వారా తన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లోకి రానున్నానన్నారు. ప్రజా ప్రతినిదిగా ఎన్నికవడానికి సామర్ధ్యం తనకున్నాయన్నారు. ఆర్ధిక, సామాజిక, సేవా, రాజకీయ అనుభవం ఉన్న తన లాంటి వారిని రాజకీయాల్లోకి రావాలని స్నేహితులు, మేధావులు, బంధువులు, తమ సామాజికవర్గం కోరుతుందన్నారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని లోచర్లకు చెందిన కొప్పల వెలమ సామాజిక వార్గనికి చెందిన తనకు అవకావం ఇవ్వాలన్నారు. జిల్లాలో బొబ్బిలి, గజపతినగరం, ఎస్‌. కోట, రాజాం, విజయనగరం నియోజకవర్గాల్లో తమ సామాజిక వర్గం ప్రధానంగా ఉందన్నారు. ఉన్నత విద్యావంతుడునైన తాను విశ్వసనీయతతో విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో ప్రజలకు సుపరిచితుడునని చెప్పారు. బొబ్బిలి లోక్‌సభ, పునర్విభజన తర్వాత విజయనగరం పార్లమెంటరీకి ఇప్పటి వరకూ ఇంత పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కొప్పల వెలమకు సీటు కేటాయించలేదన్నారు. రెండు దశాబ్ధాలు పాటు ఆంద్రప్రదేశ్‌ స్టేట్‌ పైనాన్సియల్‌ కార్పొరేషన్‌కు సేవలందించానన్నారు. బాల్యం నుండి తనకు సామాజిక, స్వచ్చంద సేవకు పుణాది పడిందన్నారు. జన విజ్ఞానం, బహిరంగ సభలో పాల్గొని నిరంతరం ప్రజల్లో ఉన్నానన్నారు. నీతి, నిజాయితీతో పాటు టీమ్‌ వర్కుపై అపార అనుభవం ఉన్న తనకు అవకాశం వస్తే మరింతగా ప్రజా సేవ చేస్తానన్నారు. సూత్రాలు, విధానాలు ఆధారంగా 43 సంవత్సరాలు వయస్సులోనే మేనేజ్‌మెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవలో ఉన్నానన్న సంగతి అందిరికి తెలిసిందే అన్నారు. దాదాపుగా ఆరు సంవత్సరాలు పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల ఫొరమ్‌ పూర్తికాల సభ్యునిగా ( సభ్‌- జడ్జి) ర్యాంక్‌లో పనిచేశానని గుర్తు చేశారు. శ్రీ సాయి కళానికేతన్‌ చైర్మన్‌గా 9 నంది అవార్డులు, ఇతర ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందామన్నారు. 1999లో కాంగ్రేస్‌ పార్టీ విజయనగరం జిల్లా తెర్లాం అసెంబ్లీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన సమయంలో కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడి తన అవకాశాన్ని అడ్డుకున్నాయన్నారు. ఏదిఏమైనా తాను ప్రజల మీద బతికే నాయకుడుగా కాకుండా ప్రజల కోసం బతికే సేవకుడుగా ఉండాలన్నదే తన ఆశ ఆశయమని చెప్పారు.

➡️