ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీలు

Dec 1,2023 21:46

  ప్రజాశక్తి – కురుపాం  :  ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సందీప్‌ కుమార్‌, వైడిఒ నెట్వర్క్‌ అవుట్‌ రిచ్‌ వర్కర్‌ ఎ.గీతారాణి, వైద్య సిబ్బంది ప్యాలెస్‌ రోడ్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కురుపాం కెటిఆర్‌ కళాశాల కరస్పాండెంట్‌ కె.తిరుపతిరావు తమ విద్యార్థులతో బస్టాండ్‌ వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించి ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు.పాలకొండ : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల బాలురు ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్‌ డే, రెడ్‌ రిబ్బన్‌ ఆకారంలో కూర్చుని అందరిని ఆకట్టుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ పైల శంకర్రావు విద్యార్థులకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తేజేశ్వరరావు, గోవిందరావు, నారాయణరావు, శివానంద, శ్రీనివాసరావు, మాణిక్యరావ,ు నాగభూషణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.సీతానగరం :స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. కాలేజీ నుంచి బజారు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌ వంటి వ్యాధి కాదని అంటించుకునే వ్యాధిని నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డివిజివిఎస్‌ త్రినాధ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ డి.రామకృష్ణ, వినోద్‌, రామారావు, అధ్యాపకులు ప్రసాద్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.సీతంపేట :మండలంలోని ధోనుబాయి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండగొర్రె సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల నుండి మెయిన్‌ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కె.వెంకనాయుడు, హెల్త్‌ సూపర్వైజర్‌ రామచంద్రరావు, పిడిలు ఆర్‌సి రెడ్డి, వెంకట్రావు, ఉపాధ్యాయులు విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు.పాలకొండ : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల బాలురు ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్‌ డే, రెడ్‌ రిబ్బన్‌ ఆకారంలో కూర్చుని అందరిని ఆకట్టుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ పైల శంకర్రావు విద్యార్థులకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తేజేశ్వరరావు, గోవిందరావు, నారాయణరావు, శివానంద, శ్రీనివాసరావు, మాణిక్యరావ,ు నాగభూషణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.సీతానగరం :స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. కాలేజీ నుంచి బజారు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌ వంటి వ్యాధి కాదని అంటించుకునే వ్యాధిని నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డివిజివిఎస్‌ త్రినాధ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ డి.రామకృష్ణ, వినోద్‌, రామారావు, అధ్యాపకులు ప్రసాద్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.సాలూరు: ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని నీడ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన వైద్య, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నకుమారి, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నీడ్‌ డైరెక్టర్‌ పి.వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎయిడ్స్‌ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నీడ్‌ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది మహేష్‌, రామకష్ణ, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్‌ జె.రాములమ్మ మాట్లాడుతూ ఎయిడ్స్‌ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వ్యాధి వల్ల వచ్చే అనర్ధాలు గుర్తించాలని సూచించారు. ఎయిడ్స్‌ వ్యాధి వల్ల కలిగే నష్టాలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ టి. శ్రీ వరం, ఎన్‌ ఎస్‌ ఎస్‌ పిఒ త్రినాధ, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.తాడికొండలో :…మండలంలోని తాడికొండలో ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బుద్దేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు రత్న ప్రసాద్‌, ప్రకాష్‌, లక్ష్మణ, బుజ్జి, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం రవి తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం : మండలంలోని ప్రపంచ ఎయిడ్స్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఎం.కుమారస్వామి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.సాయిరాం డిగ్రీ కళాశాల ర్యాలీపార్వతీపురం : స్థానిక సాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్‌ నిర్మూలలపై అవగాహన ర్యాలీచేశారు. ఆ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ 1,2 కోఆర్డినేటర్లు డి దేవి, తిరుపతిరావు ఆధ్వర్యంలో బైపాస్‌ లోనున్న డిగ్రీ కళాశాల నుండి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆ కళాశాల ప్రిన్సిపల్‌ జి శ్రీధర్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ నిర్మూలన కై ప్రతి ఒక్కరు బాధ్యతని.ఎయిడ్స్‌ రహిత ప్రపంచాన్ని నిర్మించే దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనికోరారు.ఈ ర్యాలీలోసాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️