ఎర్రజెండాకు అండగా నిలవాలి

Mar 20,2024 21:36

ప్రజాశక్తి కొమరాడ : రానున్న ఎన్నికల్లో మతోన్మాద బిజెపితో జతకట్టిన పార్టీలను ఓడించి, ఎర్రజెండాకు అండగా నిలవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకాడ ఇందిర కోరారు. మండలంలోని దేవుకోన పంచాయతీ అంటివలస గ్రామంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇందిర, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద బిజెపిని బలపరిచే పార్టీలను ఓడించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు అండదండగా ఉంటున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సమావేశంలో సిపిఎం నాయకులు వెంకటేష్‌, రామారావు, గిరిజన సంఘం నాయకులు గంగరాజు, బలరాం, సోమేశ్‌, కృష్ణ పాల్గొన్నారు.

➡️