ఎర్రటి ఎండలో పొర్ల దండాలతో రోడ్డుపైన నిరసన

Feb 22,2024 17:22 #CITU leaders, #Tirupati district
  • రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి : సిఐటియు జిల్లా నాయకులు ఎస్. జయచంద్ర

ప్రజాశక్తి – క్యాంపస్ ( తిరుపతి) : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ఒప్పంద సేవలు కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు ఎర్రటి ఎండలో నడిరోడ్డు పొర్లుదండాలు పెడుతూ..నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయ చంద్ర, ఆప్కస్ రాష్ట్ర అధ్యక్షుడు గండికోట చిన్నబాబులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు జీవో ఇచ్చినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం దాని అమలు జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం పేదలు దళితులు గిరిజనులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో కూలికి వెళుతుంటే కనీసం కనికరం లేకుండా వేతనం పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదన్నారు. బేసిక్ పే, డిఏ, సిసిఏ తో కూడిన చేయాలి అగ్రికల్చర్ పరిధిలోని రీసెర్చ్ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు లేబర్ వివరాలను రీసెర్చ్ స్టేషన్ లో నమోదు చేయాలి వారిని టైం స్కేల్ వర్కర్లకు గుర్తించాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ పరిధిలోని వివిధ రీసెర్చ్ స్టేషన్లో పనిచేస్తున్న కాంటాక్ట్ లేబర్ ను ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ లో చేర్చాలి నిబంధనలో ఉన్నప్పటికీ వాటిని యూనివర్సిటీ యాజమాన్యం తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. కాంట్రాక్ట్ లేబర్ కు సంవత్సరం మొత్తం పని చూపించాలని డిమాండ్ చేయడం జరిగింది . గత 22 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ ని నమ్ముకుని ఉన్న అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ మొదటి ప్రాధాన్యత ఆఫీసులలో పనిచేస్తున్న స్లీపర్ అటెండర్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి కోరడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న ప్రమాద సహజ మరణ నష్టపరిహారం కూడా ఇవ్వాలి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంట్రాక్టు లేబర్ కు జాతీయ పండుగ ఆరు సెలవులు ఇవ్వాలని ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదు. ఇవన్నీ ప్రభుత్వం అమలు చేయకుండా పోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వరలక్ష్మి , చంద్రమ్మ సుబ్బు ముని లక్ష్మి రాధా ,గిరి రేవతి, నాగరాజు , నవీన్,చక్రి, మురళి , రత్నమ్మ,లావణ్య,గుణ,గుర్రప్ప, రాధిక , జయంతి తదితరులు పాల్గొన్నారు.

➡️