ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు టెన్త్‌ ప్రజ్ఞా ప్రతిభ ఎగ్జామ్స్‌ నిర్వహణ

Feb 1,2024 16:53 #Exams, #Kurnool, #sfi state committe

ప్రజాశక్తి-మద్దికేర(కర్నూలు) :మద్దికేర మండల కేంద్రం ఆదర్శ పాఠశాలలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభ ఎక్సామ్‌ను నిర్వహించారు . ప్రతిభ మోడల్‌ ఎగ్జామ్‌ కు 250 మంది విద్యార్థులు పాల్గొనగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి, రంగ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ రంగస్వామి మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోడల్‌ టెస్ట్‌ ఎగ్జామ్‌ ద్వారా విద్యార్థులు భయాందోళనకు మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఉపయోగపడుతుందని అన్నారు. గురువారం ప్రతిభ ఎగ్జామ్‌ ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కడవల రవికుమార్‌ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు భయాందోళనకు మానసిక ఓత్రిడికి గురికాకుండా ప్రతిభ ఎక్సామ్‌ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతిభ ఎగ్జామ్‌ ద్వారా పాలిసెట్‌ రాసే విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత చదువుల్లో అవసరమని, సమయపాలన పాటించడంలో కూడా ఎగ్జామ్‌ దోహదపడుతుందని అన్నారు.ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం విద్యార్థుల ఎదుగుదల కోసం నిరంతరం కషి చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘమేనని ఉందని గర్వంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సవిత, కెవిఆర్‌ గర్ల్స్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు దేవేంద్రప్ప , యం. అగ్రహారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఫరూక్‌, యుటిఎఫ్‌ మండల నాయకుడు విశ్వనాథ్‌,ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకుడు సునీల్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్‌, మండల అధ్యక్షుడు వంశీ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భి.విక్రమ్‌, వి.వంశీ తదితరులు పాల్గొన్నారు.

➡️