ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభను జయప్రదం చేయండి

ప్రజాశక్తి-కనిగిరి: ఎస్‌ఎఫ్‌ఐ ప్రకాశం జిల్లా 45వ మహాసభలు డిసెంబర్‌ 12,13 తేదీల్లో ఒంగోలు నగరంలో జరుగుతాయని ఆ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ వినోద్‌, కనిగిరి కార్యదర్శి మధు కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో ఎస్‌ఎఫ్‌ఐ కనిగిరి కమిటీ సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ వినోద్‌ మాట్లాడుతూ అధ్యయనం, పోరాటం నినాదంతో స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో ఏర్పడిన ఎస్‌ఎఫ్‌ఐ ప్రకాశం జిల్లా 45వ మహాసభ నిర్వహిస్తుందన్నారు. గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించు కొనేందుకు, ప్రకాశం జిల్లా విద్యారంగ అభివృద్ధికి అవసర మైన తీర్మానాలను నిర్ణయించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయన్నారు. ఈ మహాసభలకు జిల్లాలోని ముఖ్యమైన విద్యార్థి నాయకులు పాల్గొంటారని తెలిపారు.

➡️