ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి

Dec 24,2023 23:40
డిసెంబర్‌ 27, 28, 29

ప్రజాశక్తి – కాకినాడ

డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో కాకినాడలో జరుగుతున్న భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఎపి 24వ రాష్ట మహాసభలను జయ ప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌ పిలుపునిచ్చారు. నగరంలోని అంబేద్కర్‌ భవన్‌ వద్ద ఆదివారం రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం విద్యారంగంలో ఉన్న సమస్య లు పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాలను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలకు ఎస్‌ఎఫ్‌ ఐ జాతీయ నాయకులు, పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు కెఎస్‌. లక్ష్మణ్‌ రావు, ఇళ్ళ వెంకటేశ్వరరావు, మాజీ ఎంఎల్‌సి విఠలపు బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా, వ్యతిరేక విధానాలను చర్చి స్తామని, ఈ మహాసభలో వచ్చే రెండు ఏళ్ళ కాలంలో ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఏ కార్య క్రమాలు నిర్వహించాలనే అంశాలపై చర్చించి భవిష్యత్‌ కర్తవ్యాలను రూపొందించుకుంటామన్నారు. ఈ మహా సభ కాకినాడ నగరంలో నిర్వహించడం అభినంద నీయమన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్‌ 24వ రాష్ట్ర మహాసభలకు అల్లూరి సీతారామరాజు చదివిన నగరం, పేద విద్యార్థులకు చదువు అందించడం కోసం తమ ఆస్తిని మొత్తాన్ని విద్యకు దానం చేసిన మల్లాడి సత్యలింగ నాయకర్‌, పిఠాపురం రాజా స్ఫూర్తితో కాకినాడలో మహాసభలు నిర్వహించడం చారిత్రాత్మక ఘట్ట మన్నారు. ఈ మహా సభలు జయప్రదం చేయడం కోసం జిల్లాలో ఉన్న విద్యావేత్తలు, ప్రముఖులు, రాజ కీయనేతలు, విద్యా ర్థులు, విద్యారంగ శ్రేయోభిలాషులు సహకరించాలని కోరారు. ఈ మహాసభ జయప్రదం కోసం తమ వంతు పాత్ర పోషించాలని కాకినాడ జిల్లా విద్యార్థి లోకాన్ని కోరారు. ఈ మహాసభలు అనంతరం 29వ తేదీ మధ్యాహ్నం ఆనంద్‌ భారతి గ్రౌండ్‌ నుంచి మేక్లారిన్‌ గ్రౌండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, బహిరంగ సభ నిర్వహిస్తామని ఈ బహిరంగ సభకు, ర్యాలీకి విద్యార్థులు అందరూ తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రాజా, జిల్లా అధ్యక్షులు వరహాలు, జిల్లా నాయకుల శ్రీకాంత్‌, వాసు, సాహిత్‌, గోపాలకృష్ణ వెంకటేశ్‌, ఆదర్శ కార్తీక్‌, జయరాం, రాజేష్‌, మణికంఠ, సాహిత్‌, లోవతల్లి, అమృత, మానస, భవాని, హేమ తదితరులు పాల్గొన్నారు.

➡️