.ఎస్‌కె పాడు పార్క్‌ పనులు పూర్తి చేయాలి

Jan 22,2024 21:32

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్‌ పేట పంచా యతీ సవరకోటపాడు ఉద్యానవన సుందరీకరణ పనులు పూర్తి చేయాలని పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా సోమవారం ఎస్‌కె పాడు ఉద్యాన నర్సరీలో చేపడుతున్న పర్యాటక సుందరీకరణ పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు చేపట్టడంలో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. పర్యాటక నిలయాలుగా ఈ ప్రాంతం మారాలని, ఇక్కడ ప్రకృతి రమణీయతలు, వాగులు, జలపాతాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అన్నారు. ఒకసారి పర్యాటకులు సందర్శిస్తే మరపురాని అనుభూతి కలుగుతుందన్నారు. పార్కు మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా కొనుగోలు చేసిన సామాగ్రిని ప్రాజెక్టు అధికారి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ అధికారి జె శాంతీశ్వర రావు, భద్రగిరి ఇంజనీరింగ్‌ డిఇ సింహాచ లం, ఎఇలు తదితరులు పాల్గొన్నారు

➡️