ఎంఇఒ నాగేంద్రవదన్‌కు పితృవియోగం

ప్రజాశక్తి-చీమకుర్తి : ఎంఇఒ బత్తుల నాగేంద్రవదన్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి బత్తుల సుబ్బారాయుడు (76) గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందాడు. చీమకుర్తి అంబేద్కర్‌ నగర్‌లోని వారి స్వగృహంలో సుబ్బారాయుడు భౌతికాయాన్నిపలువురు సందర్శించి నివాళులర్పించారు. ఎంఇఒ నాగేంద్రవదన్‌కు సానుభూతిని తెలిపారు. సుబ్బారాయుడు చేసిన సేవలను కొనియాడారు. సుబ్బారాయుడుకు నివాళులర్పించిన వారిలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌కె. అక్బర్‌, చలువాది శ్రీను, కోశాధికారి పి.వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు బి. వసంతరావు,పి.దేవదాస్‌, ఎస్‌కె.శిలార్‌, బండి శ్రీనివాసరావు,ముప్పరాజు వెంకటరావు, పీరుసాహెబ్‌, వీరారెడ్డి, గుద్దంటి వెంకటేశ్వర్లు, పి.రమేష్‌, అర్జున్‌, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ,టిడిపి నాయకులు కాట్రగడ్డ రమణయ్య తదితరులు ఉన్నారు.

➡️