ఎస్‌పి ఆకస్మిక తనిఖీలు

Mar 1,2024 21:02

 ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని బొడ్డవర చెక్‌పోస్టును ఎస్‌పి దీపిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహన తనిఖీలను పర్యవేక్షించి, రికార్డులను తనిఖీ చేశారు. వాహన తనిఖీల్లో వాహనాలను రోడ్డు పక్కగా ఆపాలని, వాహన రికార్డులు పరిశీలించి, వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలని ఎస్‌పి సూచించారు. ఒడిశా నుండి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. చెక్‌ పోస్టు వద్ద నిఘా పెట్టేందుకు, తనిఖీలను పర్యవేక్షించేందుకు రెండు వైపులా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎస్‌.కోట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం పలు కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలను, గంజాయి భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఎస్‌పి వెంట సిఐ ఉపేంద్ర, ఎస్‌ఐలు గంగరాజు, పోలినాయుడు, తదితరులు ఉన్నారు.

➡️