ఏఎంసీ చైర్మన్‌ను కలిసిన ఇన్‌ఛార్జి దద్దాల

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి ఏఎంసి చైర్మన్‌ చింతగుంట్ల సాల్మన్‌రాజును కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్‌ ఏఎంసి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. జగనన్న దళిత సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందని కాబట్టి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేసి జగనన్నకు కానుకగా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాణిక్యరావు, కనిగిరి జడ్‌పిటిసి కస్తూరిరెడ్డి, మాజీ సింగల్‌ విండో చైర్మన్‌ ఎస్‌ మోహన్‌రెడ్డి, సానుకొమ్ము వెంకటేశ్వరరెడ్డి, దాదిరెడ్డి మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️