ఐక్యతో పని చేద్దాం.. : వేమిరెడ్డి

Jan 12,2024 22:23
ఫొటో : మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
ఐక్యతో పని చేద్దాం.. : వేమిరెడ్డి
ప్రజాశక్తి-ఉదయగిరి : జగనన్న గెలుపునకు మనమందరం ఐక్యమత్యంతో పని చేసి గెలిపించుకుందామని రాజ్యసభ సభ్యులు, వైసిపి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బస్టాండ్‌ సెంటర్లో వైసిపి బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. అభివృద్ధి సంక్షేమం సమపాలుగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేశారన్నారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన 95శాతం హామీలను అమలుపరిచిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మహిళలు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఓటు వేసి మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కార్యకర్త సైనికుల పనిచేసి వైసిపి అఖండ విజయం సాధించే పెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలో చిన్న చిన్న అవగాహన లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే తక్షణమే పరిష్కరిస్తారని తెలిపారు. మొదటిగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బైకులతో యువకులు ర్యాలీ నిర్వహించి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం చేజర్ల సుబ్బారెడ్డి స్వగృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి గత ఎన్నికల్లో ఎంత కసిగా పనిచేశామని మళ్లీ ప్రతి ఒక్కరూ అంతే ఖచ్చితంగా పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, వైసిపి నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయ రెడ్డి, మాజీ ఎంపిపి చేజర్ల సుబ్బారెడ్డి, జెడ్‌పిటిసి మోడీ రామాంజనేయులు, మండల కన్వీనర్‌ సిఎం ఓబుల్‌ రెడ్డి, మాజీ ఎఎంసి చైర్మన్‌ అలీ అహ్మద్‌, సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️