ఐదో రోజు అంగన్‌వాడీల సమ్మె

ఐదో రోజు అంగన్‌వాడీల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగంతమ డిమాండ్ల సాధనకు అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. నోటికి నల్ల రిబ్బన్లు, కళ్లకు గంతలతో, మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలపారు. నల్లజర్లలో సిఐటియు జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు సమ్మె శిబిరంలో మాట్లాడారు. అంగన్‌వాడీలు నల్ల రిబ్బన్స్‌ ధరించి ఒంటి కాలిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఒంపుగడప చంద్రకాంత, గొర్రెల తులసివాణి, మర్రి మల్లమ్మ, అలుగోలు రత్నకుమారి మాట్లాడారు. కె.విమలబారు, ఎస్‌.శివకుమారి, ఝాన్సీలక్ష్మి, ఐ.రామలక్ష్మి, నాగమణి, రాజేశ్వరి, పి.జగదీశ్వరి, బేబీ,దుర్గంబికా, ధనలక్ష్మి, ఎం.మల్లమ్మ, ఎం.మాలతి, వెంకటరత్నం పాల్గొన్నారు. కొవ్వూరు రూరల్‌ ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యంబ, ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సి.హెచ్‌ పుష్పవతి మాట్లాడారు. వసంతాడ శ్రీదేవి, చీర దుర్గాభవాని, బందలపాటి పద్మజ, అలమండ నరసమాంబ, నేతల శాంత కుమారి, వేళంగి మధురవల్లి, దమ్ము అమరావతి పాల్గొన్నారు. గోకవరం టిడిపి, జనసేన పార్టీ నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. ఉండ్రాజవరం సమ్మె అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. పెరవలి ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ గౌరవాధ్యక్షుడు జువ్వల రాంబాబు అంగన్వాడీలకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఎస్‌.రంగనాయకమ్మ, కె.లకీëకుమారి, ఎం.జానకి, కెఎన్‌ఎస్‌.ప్రసన్నకుమారి, సిహెచ్‌.జ్యోతి, ఎంవి.నరసమ్మ, జి.సువర్ణలత, ఉషారాణి, పి.గిరిజ, నిర్మల, కె.విజయ కుమారి, కె.వరలక్ష్మి పాల్గొన్నారు. కడియం సమాచార హక్కు చట్టం సభ్యులు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. మండల అధ్యక్షుడు పళ్ల వెంకటగిరి, చిలుకూరి నాగేశ్వరరావు, యండమూరి శ్రీనివాస రావు, గాధ నాగేశ్వరరావు, చిక్కాల శ్రీనివాసులు, ఉండమట్ల ప్రభాకర్‌, కామిశెట్టి వెంకటేష్‌ పాల్గొన్నారు. తాళ్లపూడి అంగన్‌వాడీలు కళ్ళకు నల్ల రిబ్బన్లు ధరించి మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. దుర్గ, సుజాత, భాస్కరం, దయామణి పాల్గొన్నారు. దేవరపల్లి యూనియన్‌ నాయకురాలు టిపి.లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రగతిశీల కార్మిక సంఘం సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ మస్తాన్‌, ఐఎఫ్‌టియు నాయకులు పి.రమేష్‌, గ్యాస్‌ డెలివరీ బార్సు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వేల్పూరు దుర్గారావు, సిపిఎం నాయకులు ఉండవల్లి కృష్ణారావు, సిఐటియు నాయకులు ఎస్‌.భగత్‌, కె.రత్నాజీ మద్దతు తెలిపి మాట్లాడారు. ఎ.పద్మ కామేశ్వరి, కె.నర్సమ్మ, కడలి వేణు, కొమిరెడ్డి బలిసి కుమారి, బోనాల స్పందన, ఏలూరు సంధ్య, పి.నాగమణి, కె.గంగాభవాని, ఎస్‌.ఇందిర పాల్గొన్నారు. చాగల్లు అంగన్‌వాడీలకు కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షురాలు అరిగెల అరుణ కుమారి మద్దతు తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి కెకె.దుర్గారావు, బొనిగే రాంబాబు, సత్యనారాయణ, జొన్నకూటి రవి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. గోపాలపురం గోపాలపురం మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. సిఐటియు నేత రామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అంగన్వాడీలను మోసం చేయడం దుర్మార్గమన్నారు. టిడిపి నాయకులు చదలవాడ ప్రసాద్‌, జామి సూర్యచంద్రం, ముప్పిడి అశోక్‌, బొల్లిన బాబి, చాపల రవి, జేష్ట సత్యనారాయణ, జొన్నలగడ్డ శేఖర్‌, జొన్నలగడ్డ శ్రీను సీతానగరం నల్ల దుస్తులు ధరించి, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సుబ్బలక్ష్మి, సిహెచ్‌.సువర్ణ, సుభాషిణి, ఉమాదేవి, ప్రశాంతి, వెంకట లక్ష్మి, వెంకటేశ్వరి పాల్గొన్నారు.

➡️