ఐద్వా జాతీయ సమావేశాల పోస్టర్‌ ఆవిష్కరణ

 ప్రజాశక్తి -ములగాడ : ఐద్వా మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన గుల్లలపాలెంలో జాతీయ సమావేశాల పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.విమల మాట్లాడుతూ, నేడు మహిళలపై దాడులు హత్యాచారాలు, మానబంగాలు జరుగుతుంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్ని చట్టాలు ఉన్నా న్యాయం జరగడంలేదన్నారు. దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణలో ఐద్వా మల్కాపురం జోన్‌ అధ్యక్షులు బి.మమత, కె.ఈశ్వరమ్మ, పి.పుణ్యవతి, కృష్ణవేణి, హేమ, రుధ్ర, సుజాత తదితరులు పాల్గొన్నారు.

 

➡️