ఐద్వా జిల్లా ప్లీనంను జయప్రదం చేయండి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)జిల్లా ప్లీనం ఈ నెల 21వ తేదీన సంత నూతలపాడులోని సుందరయ్య భవన్లో జరుగు తుందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విజ్ఞప్తి చేశారు. ఐద్వా మండల కమిటీ సమావేశం మంగళవారం మండల ఐద్వా అధ్యక్షురాలు బి పద్మ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఐద్వా నిరంతరం అనేక మహిళా సమస్యల మీద పోరాడుతున్నదని అన్నారు. మహిళల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపట్టిందని, సమాజంలో ఉన్న సనాతన సాంప్రదాయాలు అంతరించాలని ప్రచార ఉద్యమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. సంఘసంస్కర్తలైన గురజాడ, జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ లాంటి మహానేతల జయంతులు, వర్థంతుల సందర్భంగా సభలు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐద్వా మండల కార్యదర్శి నెరుసుల మాలతి మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా నిర్వహించిన ఉద్యమాలు సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను ఈ ప్లీనంలో రూపొందించుకుం టామని తెలిపారు. ప్లీనం సమావేశానికి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి హాజరవుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, మహిళల మీద పడుతున్న దుష్ప్రభావాలు అనే అంశంపై ఆమె వివరిస్తారని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి ఐద్వా ముఖ్య కార్యకర్తలంతా హాజరవుతారని, ఈ ప్లీనం సమావేశాల జయప్రదానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మండల కమిటీ సభ్యులు కుంచాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

➡️