ఒంటికాలితో నిరసన

పోరుమామిళ్ల : జీతాలు పెంచే వరకు అంగన్వాడీల పోరాటం ఆగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు భైరవ ప్రసాద్‌ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో 25వ రోజున సమ్మెలో భాగంగా శుక్రవారం గోవింద నామాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల పైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అల్టిమేట్‌ జారీ చేసి భయభ్రాంతులను చేయడం చాలా దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు ఓబులాపురం విజయమ్మ, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు మేరీ, దస్తగిరిమ్మ జ్యోతిమ్మ రేణుక, రమాదేవి, విజయమ్మ, శ్రీదేవి, లక్ష్మీదేవి, సిఐటియు మండల నాయకులు బొజ్జ చిన్నయ్య పాల్గొన్నారు. జమ్మలమడుగు : పట్టణంలోని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మె శుక్రవారం 25వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు సామూహికంగా సెల్‌ ఫోన్లకు పూజ చేసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు యూనియన్‌ నాయకులు భాగ్యమ్మ మాట్లాడుతూ 25 రోజుల నుంచి నిరోధిక సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి తమ ప్రభుత్వం వస్తే తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని అన్నారు. ఇప్పుడున్న నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో కుటుంబ పోషణ భారం అవుతుందని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఐదు లక్షలు ఇవ్వాలని,మినీ అంగన్వాడి సెంటర్లు మెయిన్‌ సెంటర్లుగా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దాసరి విజరు లక్ష్మీదేవి, జ్యోతి, నరసమ్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు. చాపాడు : అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర సూచించారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సుబ్బారెడ్డి, రమణ, టిడిపి నాయకులు శేఖర్‌ రెడ్డి,అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేంపల్లె : అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మె శుక్రవారం 25వ రోజుకు చేరింది. మోకాళ్లపై కూర్చుని చేతులెత్తి దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వేంపల్లె, చక్రాయపేట, వేముల అంగన్వాడీల మహిళాలు పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు అన్నారు. శుక్రవారం పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. బద్వేలు : స్థానిక బద్వేలు సమగ్ర శిశు అభివద్ధి అధికారి (సిడిపిఒ) కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) బద్వేల్‌ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 25వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేతులు జోడించి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బద్వేలు ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఆర్‌.హుస్సేనమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం అమానుషమాని పేర్కొన్నారు. 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రిలో, ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని, సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రయత్నం చేయటం సబబు కాదని పేర్కొన్నారు. సమ్మె భవిష్యత్తులో మరింత ఉదతం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు సుభాషిని, నాయకురాలు జయప్రద, అరుణమ్మ, రాధమ్మ, సత్యవతి, విజయమ్మ, కళావతి, ఉమాదేవి, మహాలక్ష్మి, తులసమ, ,కష్ణవేణి, ప్రవీణ పాల్గొన్నారు. మైదుకూరు: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ మైదు కూరులో అంగన్వాడీలు ఒంటి కాలుపై నిలుచుని తమ నిరసనను తెలిపారు. స్థానిక సిడిపిఒ కార్యాలయం ముందు 25వ రోజు శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు నిరసన తెలిపారు. టిడిపి రాష్ట్ర నాయకులు పార్ధసారది మద్దతు పలికారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు ధనలక్ష్మి, .జి.లక్ష్మి, చెన్నమ్మ, ఎఐటియుసి నాయకులు శివరాం, కార్యకర్తలు పాల్గొన్నార. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద 25వ రోజు శుక్రవారం అంగన్వాడీలు ఒంటి కాలిపై నిల్చుని దండం పెడుతూ నిరసన తెలియజేశారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు 25 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సరైనటువంటి పద్ధతి కాదన్నారు. బాలింతలు గర్భవతులు చిన్నపిల్లలు అంగన్వాడీల సమ్మెతో ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. అంగన్వాడీలు నాణ్యమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ,సిఐటియు కార్యదర్శి విజరు కుమార్‌,ఏఐటిసి నాయకులు విజయ, మంజుల,అంగన్వాడి యూనియన్‌ కార్యదర్శి సుబ్బలక్ష్మి,రాజీ,సువార్తమ్మ,నాగలక్ష్మి,పద్మ,కష్ణవేణి, లక్ష్మీదేవి,నిర్మల,శివమ్మ,గురుదేవి మరియు అర్బన్‌ సెంటర్ల అంగన్వాడీలు పాల్గొన్నారు వీరికి మద్దతుగా టిడిపి రాష్ట్ర నాయకులు పార్థసారధి రెడ్డి సంఘీభావం తెలపడం జరిగింది ఎలక్ట్రిసిటీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు నాగరత్నాచారి మద్దతు తెలిపారు.

➡️