ఒపిఎస్‌ అమలుకు పోస్టుకార్డు ఉద్యమం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ పాత పెన్షన్‌ పునరుద్ధరణ అంశాన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని యుటిఎఫ్‌ నాయకులు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. గత ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్‌ విధానం పునరు ద్ధరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి, ఒపిఎస్‌పై తమ వైఖరి ప్రకటిం చాలని తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, షర్మిలలకు బుధవారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉత్తరాలు రాసి పోస్టు బాక్స్‌లో వేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వారికి మాత్రమే రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగుల కుటుంబాల ఓట్లు వేయాలని నిర్ణయిం చుకున్నామని ఈ సందర్బంగా యుటిఎఫ్‌ నాయకులు తెలిపారు. అలక్ష్యం చేయకుండా ఆయా పార్టీల అధినేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్‌, పెనగలూరు మండల అధ్యక్షులు వినోద్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి నరసింహారావు, కోశాధికారి మాధవ మూర్తి, జిల్లా కౌన్సిలర్లు చెన్నయ్య, మహమ్మద్‌ రఫీ, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అన్వర్‌ బాషా, సుదర్శన్‌, మహేంద్ర, ప్రమీల, శ్రీవాణి, పరిమళ, శివ, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

➡️