ఒపిఎస్‌ అమలు చేసే వారికే ఓటు

Mar 1,2024 20:59

 ప్రజాశక్తి- గరివిడి  : జిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేసిన వారికే ఓటు వేయాలని, ఆప్రాప్తికి రాబోయే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీల మేని ఫెస్టోలలో ఒపిఎస్‌ అమలు చేస్తామనే విషయాన్ని చేర్చి అమలు చేస్తామని హామీ ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భరోసా ఇవ్వాలని యుటిఎఫ్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకులు డి. రాము పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి యుటిఎఫ్‌ ముద్రించిన ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ ప్రచార పుస్తకాలను ఆయన రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎ. సత్య శ్రీనివాసు, జిల్లా గౌరవ అధ్యక్షులు మీసాల అప్పల నాయుడు, జిల్లా కార్యదర్శి సూరి శ్రీనివాసరావు, మండల బాధ్యులు ఎం. రవికుమార్‌, జి. లక్ష్మణ, ఎం. సూర్యనారాయణ, ఐక్య సత్యనారాయణ, ఎం. రఘునాథరాజు,ఎ. కనకేశ్వరరావు, కోట్ల రమణ, త్రినాధ్‌లతో కలిసి ఆవిష్కరించారు.

➡️