ఒపిఎస్‌ ఇచ్చిన వారికే మా ఓటు

Feb 9,2024 20:56

ప్రజాశక్తి- పార్వతీపురం  : సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ ఇచ్చిన వారికే మా ఓటు అనే నినాదంతో పోస్టరును యుటిఎఫ్‌ జిల్లా నాయకత్వం శుక్రవారము స్థానిక డిఇఒ కార్యాలయం వద్ద విడుదల చేసింది. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన రావు మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ తీసుకొస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాట తప్పారని, మడమ తిప్పారని ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసగించారని విమర్శించారు. రానున్న ఎన్నికలలో ఒపిఎస్‌ ఒక రాజకీయ ఎజెండాను మార్చడానికి ఉద్యమాన్ని చేస్తున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు కుటుంబ సభ్యులు రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయం చేయబోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా డిఇఒ కార్యాలయం, ఎస్‌ఎస్‌ఎ సిబ్బందిని కలిసి ఒపిఎస్‌ ఇచ్చిన వారికే మా ఓటు అన్న నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు వి.జ్యోతి, కోశాధికారి కె.మురళి, జిల్లా కార్యదర్శులు కె.భాస్కర రావు, యన్‌. శ్రీను, పి. వెంకట నాయుడు, గోవిందమ్మ, మండల నాయకులు పాల్గొన్నారు.

➡️