ఒపిఎస్‌ పునరుద్ధరించిన వారికే మద్దతు

Feb 15,2024 23:42 #ఒపిఎస్‌
ఒపిఎస్‌

ప్రజాశక్తి పద్మనాభం : పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలకే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు ఉంటుందని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రాము ఉప్పాడ స్పష్టం చేశారు. గురువారం యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు యన్‌ నారాయణరావు, కోలా సన్యాసిరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏఓట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌లి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఒపిఎస్‌పై స్పష్టమైన హామీ ఇవ్వడంతోపాటు, అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపైనే తొలి సంతకం చేస్తామని భరోసా, నమ్మకం కలిగించిన వారికే ఓటు వేస్తామనే అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల్లో విస్తృతం ప్రచారం చేస్తామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ పద్మనాభం మండల శాఖ గౌరవాధ్యక్షులు బోని చిన్నారావు, కోశాధికారి .వివిఎస్‌. రెడ్డి, కార్యవర్గసభ్యులు విజరు, శ్రావణి, రమణమ్మ, కాంచన పాల్గొన్నారు.

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నేతలు

➡️