ఓటరు తుది జాబితా ప్రచురణకు ముందస్తు చర్యలు

Jan 17,2024 19:33
మాట్లాడుతున్న పోలా భాస్కర్‌

మాట్లాడుతున్న పోలా భాస్కర్‌
ఓటరు తుది జాబితా ప్రచురణకు ముందస్తు చర్యలు
ప్రజాశక్తి-నెల్లూరుఈనెల 22న ఓటరు తుది జాబితా ప్రచురణ చేయడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా రోల్‌ అబ్జర్వర్‌ పోలా భాస్కర్‌ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని శంకరన్‌ హాల్లో జిల్లాలో తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సంసిద్ధత, జనాభా ఓటర్ల నిష్పత్తి, స్త్రీ పురుష ఓటర్లు తదితర అంశాలపై కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌, జిల్లాలోని ఇఇర్‌ఒలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలా భాస్కర్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, జాబితా సవరణ అంశాలకు సంబంధించి రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. వారానికి ఒకసారి రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించా లన్నారు. రాజకీయ పక్షాల నుండి గాని, వ్యక్తుల నుండి గాని, మీడియాలో గాని ఫిర్యాదులు వస్తే వాటిపై చర్య తీసుకుని ఫిర్యాదు దారులకు సమాచారం ఇవ్వాలన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రచురితం అయిన తర్వాత రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా ఇవ్వాలన్నారు. కలెక్టర్‌ హరి నారాయణన్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలుగా వినియోగించనున్న పార Äశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక వసతులైన తాగునీరు ,టాయిలెట్లు , విద్యుత్‌ ,ఫ్యాన్లు, లైట్లు తదితర సౌకర్యాలు ఈనెల 25 లోగా పూర్తి చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ రోణంకి కూర్మనాధ్‌, డిఆర్వో ఎస్‌.లవన్న, ఈఆర్వోలు విద్యాధరి, మలోల, శీనా నాయక్‌, మధులత, బాపురెడ్డి, ఓబులేసు, ప్రేమ్‌ కుమార్‌ కలెక్టరేట్‌ ఎలక్షన్‌ తాసిల్దార్లు, డిటీలు పాల్గొన్నారు.

➡️