ఓటర్లు ప్రలోభాలకు లొంగకూడదు : తహశీల్దార్‌

Mar 20,2024 16:23 #tasildar, #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి) : ఓటర్లు ప్రలోభాలకు లొంగకూడదనినరసాపురం డిప్యూటీ తహశీల్దార్‌ ఎం నిర్మల జ్యోతి అన్నారు. బుధవారం శ్రీ వైన్‌ కళాశాలలో విద్యార్థులకు నెహ్రు యువ కేంద్రం వారు నిర్వహించిన ఇంటెన్సీవ్‌ ఓటర్‌ అవరెన్స్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన వారు అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. మనతో పాటు మన చుట్టు పక్కల వారి చేత ఓటుని వేయించాలన్నారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకూడదన్నారు. ఓటు ఒక వజ్రాయుధం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్‌ ప్రిన్సిపల్‌ జీవి ఎస్‌ సాయిబాబు, జి రామకృష్ణ, ఎన్‌ఎస్‌పిఓ యాకోబు, నెహ్రూ యువజన కేంద్రం వాలంటీర్‌ కోసూరి రాజేష్‌ పాల్గొన్నారు.

➡️