ఓటు అడిగే హక్కు టిడిపికి లేదు

ఓటు అడిగే హక్కు టిడిపికి లేదు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంరాష్ట్ర ఖజానాను పూర్తిగా దోచేసి, రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిన టిడిపి, చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తారని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ప్రశ్నించారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. బాబు వస్తే చిన్నబాబు లోకేష్‌కు మంత్రి పదవి గ్యారంటీ అయింది కానీ నిరుద్యోగ యువతకు ఒక్క జాబ్‌ ఇవ్వలేదన్నారు. బాబు వస్తే భవిష్యత్తు గ్యారంటీ మాట దేవుడెరుగు..రాష్ట్రం మాత్రం దివాళా తీయడం గ్యారంటీ అన్నారు. 2014 ఎన్నికలలో 640 హామీలిచ్చారని, వాటిలో ఎన్ని అమలు చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీలకు పవిత్ర గ్రంథంగా భావించాలే తప్ప ప్రజలను మోసం చేసేందుకు ఉపయోగించే ఎర కాకూడదన్నారు. 2019లో వైఎస్‌.జగన్‌ ఏ హామీలిచ్చారో వాటన్నిటినీ అమలు చేయడమే కాకుండా.. ఇంకా ఎక్కువ అభివద్ధి పనులు చేసి ప్రజాభిమానం చూరగొన్నారని తెలిపారు.

➡️