ఓటు హక్కు వినియోగంపై అవగాహన

Feb 17,2024 21:36
ఫొటో : మాట్లాడుతున్న మాట్లాడుతున్న రాజా రమేష్‌ ప్రేమకుమార్‌

ఫొటో : మాట్లాడుతున్న మాట్లాడుతున్న రాజా రమేష్‌ ప్రేమకుమార్‌
ఓటు హక్కు వినియోగంపై అవగాహన
ప్రజాశక్తి-ఉదయగిరి : మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో ఓటుహక్కు వినియోగంపై విద్యార్థిని విద్యార్థులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజా రమేష్‌ ప్రేమకుమార్‌ అవగాహన కల్పించారు. శనివారం స్థానిక వ్యవసాయ కళాశాలలో జరిగే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకునే ప్రతీ విద్యార్థి సమర్థవంతంగా నాయకుడిని ఎన్నుకునేందుకు మొదటి ఓటును వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ ఓటు హక్కు ఈవిఎంలపై కుటుంబ సభ్యులకు తమతమ గ్రామాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులు చేసే బాధ్యత యువతపై ఉందన్నారు. అనంతరం ఎన్నికల సందర్భంగా ఈవిఎం ఉపయోగం ఎలా ఓటును సద్వినియోగం చేసుకోవాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్‌ నెహ్రూ బాబు, కళాశాల డీన్‌ డాక్టర్‌ టివి గోపికృష్ణ, ఎపిఎం ఖాజా రహమతుల్లా, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️