ఓపీఎస్‌ అమలు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చండి

Feb 21,2024 18:55

జీవీ ఆంజనేయులుకు వినతిపత్రం ఇస్తున్న యుటిఎఫ్‌ నాయకులు
ప్రజాశక్తి – వినుకొండ :
ఓపీఎస్‌ పునరుద్ధరణ అంశాన్ని టిడిపి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని యుటిఎఫ్‌ నాయకులు కోరారు. ఈ మేరకు ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులను ఆయన నివాసంలో బుధవారం కలిసి విన్నవించారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.86 లక్షల మంది సిపిఎస్‌ ఉద్యోగులున్నారని, వారందరికీ పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని కోరారు. ఓపీఎస్‌ను అమలు చేసేవారికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 లక్షల మందికి పైగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు మద్దతిస్తారని చెప్పారు. ‘ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌’ నినాదంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల ప్రధాన నాయకత్వానికి వినతి పత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ఎం.రవిబాబు, ఆర్‌.అజరు కుమార్‌, పి.ఎ.జిలాని, ఎం.పోలయ్య, పి.రమేష్‌బాబు, ఎ.నాగేశ్వరరావు, బి.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

➡️