కళ్లు మూసుకుని అంగన్వాడీల నిరసన

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కళ్లు మూసుకొని నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కళ్లు తెరిపించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ఈశ్వరమ్మ, కార్యకర్తలు విజయ, అమరావతి, శివరంజని, గౌసియా, విజయలక్ష్మి, శివ జ్యోత్స్న పాల్గొన్నారు. రైల్వేకోడూరు : అంగన్వాడీలు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చిత్రప టానికి పూలు వేసి నివాళులర్పించి వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మీ, ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు వనజ కుమారి, అధ్యక్షులు, శ్రీరమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాధా కుమారి, మండల కార్యదర్శి జి.పద్మావతి, వెన్నెల, దుర్గ, శిరీష, లీలావతి, జయకుమారి, సుజాత, మునీంద్ర, ఈశ్వరమ్మ, కుమారి, నాగరాణి, వాణి, స్వర్ణలత, గీత, సురేఖ, కళ, రెడ్డమ్మ, రోజా, చెంచులక్ష్మి, బేబీ, సునీత, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు జాన్‌ ప్రసాద్‌, నాయకులు సరోజ నిర్మల నాగమణి పాల్గొన్నారు. బి.కొత్తకోట:అంగన్వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంబేద్కర్‌ చిత్రపటానికి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ కనీస వేతనం అమలు, గ్రాట్యూటీ అమలు, మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తిం చడం, నాణ్యమైన పౌష్టికాహారం సరఫరా చేయడం, హెల్పర్లకు పదోన్నతులు కల్పించడం తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు కార్యాలయం అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి తమ సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సు కుమారి మాట్లాడుతూ మహిళలు రోడ్డుపై కొచ్చి సమ్మ చేస్తుంటే ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల గోడు పట్టడం లేదు మీరైనా జ్ఞానాన్ని ప్రసాదించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని వేతనాలు పెంచే వరకు సమ్మె విరమించమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ కార్యదర్శి ఓబులమ్మ, సెక్టార్‌ లీడర్లు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గాలివీడు మండలాలు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️