కార్యకర్తలు సర్దుకుపోవాలి: అన్నా

ప్రజాశక్తి-మార్కాపురం: తర్లుపాడులో ఏర్పాటు చేసిన వైసిపి కార్యకర్తల సమావేశంలో మార్కాపురం ఇన్‌ఛార్జి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ కలిసికట్టుగా అందరూ జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత తీసుకోవాలని కోరారు. చిన్న చిన్న మనస్పర్థలను సర్దుకొనిపోతూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వెన్నా ఇందిర, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, సర్పంచ్‌ పల్లెపోగు వరాలు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగుర్‌వలి, సొసైటీ అధ్యక్షులు ఎక్కంటి రామిరెడ్డి, మండలం కన్వీనర్‌ మురారి వెంకటేశ్వర్లు, కోఆప్షన్‌ అక్బర్‌వలి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు దూదేకుల పెద్దమస్తాన్‌, వైసిపీ నాయకులు కంది ప్రమీలరెడ్డి, మీర్జపేట ఎంపీటీసీ దేవిరెడ్డి పార్వతి, రమేష్‌ రెడ్డి, సర్పంచ్‌ మీరయ్య, జెఏసి కన్వీనర్‌ రామాంజనేయ రెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️