కార్యాలయ ప్రారంభమే విజయానికి నాంది

Mar 20,2024 21:42

ప్రజాశక్తి – కురుపాం : ఎన్నికల్లో పార్టీ విజయానికి నాంది టిడిపి కార్యాలయ ప్రారంభమేనని ఆ పార్టీ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టి.జగదీశ్వరి అన్నారు. బుధవారం కురుపాంలోని రావాడ జంక్షన్‌ సమీపంలో టిడిపి నూతన కార్యాలయాన్ని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌తో కలిసి జగదీశ్వరి ప్రారంభించారు. అనంతరం దూళికేశ్వర ఆలయం నుంచి పార్టీ కార్యాలయం వరకు టిడిపి శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల భవిష్యత్తుకు భరోసా కావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. టిడిపి ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరవేసి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌, బిసి సెల్‌ అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : కలిసికట్టుగా పనిచేసి టిడిపిని అధికారంలోకి తీసుకువస్తామని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు. బుధవారం పార్వతీపురం మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డులో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్రతో కలిసి బాబు షూరిటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు టిడిపి వైపు చూస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో ఉన్నారని చెప్పారు. సీతంపేట : మండలంలోని కొండపల్లి, కిట్టాలపాడు గ్రామాల్లో టిడిపి నియోజకవర్గ నాయకులు పడాల భూదేవి బుధవారం ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి టిడిపి సూపర్‌సిక్స్‌ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి జయలక్ష్మి, సీనియర్‌ నాయకులు మూర మోహన్‌, గుణమ్మ శంకరరావు పాల్గొన్నారు.టిడిపిలో భారీగా చేరికలుప్రజాశక్తి-సీతానగరం మండలంలో వివిధ పంచాయతీలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. టిడిపి బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జులు బేబినాయన, విజయచంద్ర సమక్షంలో మాజీ జెడ్‌పిటిసి తెంటు వెంకట అప్పలనాయుడు, బి.శ్రీరాములు, పెదబోగిల వైస్‌ సర్పంచ్‌ కె.అరవింద్‌తోపాటు కాశీపేట, గాదెలవలస, చినంకలం, బూర్జ, పెదబోగిల, పణుకుపేట, క్రిష్ణరాయపురం గ్రామాలకు చెందిన 800 మంది టిడిపిలో చేరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బొమ్మినాయుని లక్ష్మణరావు, గొట్టాపు వెంకటినాయుడు, బి.చిరంజీవి, నాగభూషణరావు పాల్గొన్నారు.పార్వతీపుంరూరల్‌ : జగన్నాథపురంలో వైసిపి నుంచి పలువురు టిడిపిలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి విజరు చంద్ర టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి పాల్గొన్నారు.

➡️