కిచ్చాడలో ఏనుగుల సంచారం

Jan 27,2024 21:35

ప్రజాశక్తి – కురుపాం : మండలంలో కిచ్చాడ పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఏనుగుల గుంపు సంచరించింది. సమీప చెరకు, అరటి తోటల్లో తిరుగుతూ పంటలను నాశనం చేసింది. దీంతో సమీప గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన గ్రామంలోకి ప్రవేశిస్తాయోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తమ ప్రాంతం నుంచి ఏనుగులను దూర ప్రాంతాలకు తరలించి, పంటలను, తమ ప్రాణాలను కాపాడాలని కోరారు.

➡️