కుల గణన పకడ్బందీగా నిర్వహించాలి :ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌

Nov 28,2023 16:26 #Kurnool

ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూలు) : కుల గణనను పకడ్బందీగా నిర్వహించాలని పత్తికొండ ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌, ఎంపీడీవో సివి కొండయ్య పంచాయతీ కార్యదర్శులను, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రమైన చిప్పగిరి కార్యాలయంలో కుల గణనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులు, సచివాల అధికారులకు కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు సమన్వయం చేసుకొని ప్రతి ఇంటికి వెళ్లి వారి పూర్వపరాలు, కులం, చేస్తున్న వత్తి, ఎంతమంది సభ్యులు ఉన్నారు వారిలో మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోని దరఖాస్తులో పొందుపరచాలన్నారు. ఇన్చార్జి ఈవోపిఆర్‌ డి టి. బాలన్న పంచాయతీ కార్యదర్శులు, సచివాల అధికారులు పాల్గొన్నారు.

➡️